Breaking News

Daily Archives: October 4, 2024

స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను పేదరికరహిత స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ కు ప్రతీ ఒక్కరూ మంచి సూచనలు అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడంపై గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ …

Read More »

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు…

-తేమశాతం, గోనేసంచుల విషయంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు.. -ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి… ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. …

Read More »

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా రవినాయుడు

-ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా,యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం .. మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని ఈ గౌరవం నాతో …

Read More »

సచివాలయ మహిళా ఉద్యోగులకు ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి ఆధ్వర్యంలో అమరావతిలోని సచివాలయంలో మహిళా ఉద్యోగులకు పింక్ బస్ ద్వారా రెండు రోజుల పాటు జరిగిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బ్లాక్ నంబరు 3లోని మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు విశేషంగా పాల్గొని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయ మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన …

Read More »

విజ‌య‌వాడ‌లో డ్రైనేజీ స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారం కోసం జాయింట్ ఇన్స్పెక్ష‌న్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపీల‌తో స‌మావేశం నిర్వ‌హించిన సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జీఎం -పెండింగ్ ప్రాజెక్టులపై చ‌ర్చ‌ -రైల్వే అండర్ బ్రిడ్జిల పూర్తికి సానుకూలం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానమైన నాలుగు డ్రైన్ల స‌మ‌స్య రైల్వే శాఖ తో ముడిప‌డి వుంది. గ‌త ప్ర‌భుత్వం చిత్త శుద్ధితో ప‌నిచేసి వుంటే విజ‌య‌వాడ కి ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద కూడా వ‌చ్చేది కాదు. డ్రైనేజీ పూడిక‌లు తీసి వుంటే వ‌ర‌ద వ‌చ్చి వుండేది కాదు. రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, వి.యం.సి అధికారులు క‌లిసి …

Read More »

ప్రశాంతం గా ముగిసిన రెండవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా రెండవ రోజు తెలుగు, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో18906 మందికి గాను 16430 మంది అభ్యర్థులు అనగా 86 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 37సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 5940 మందికి గాను 5053 మంది అనగా 85. 07 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ …

Read More »

కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ

-ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ -సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది పోస్టులను పొరుగుసేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేయడానికి అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ నుండి …

Read More »

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2024

-శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామల రావు అదనపు ఈఓ …

Read More »

2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన

-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద …

Read More »

అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM) విజయవంతంగా అమలవుతోందని, అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇటువంటి అత్యాధునిక విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM)పై సమగ్ర …

Read More »