ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారని.. బుధవారం మూలా నక్షత్రం పవిత్ర రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని.. ముఖ్యంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 13 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేకువజామున మూడు గంటల నుంచి రాత్రి 11, 11.30 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం …
Read More »Daily Archives: October 8, 2024
స్వర్ణాంధ్ర 2,047 విజన్ అభివృద్ధి రాబోయే పౌరులకు ఎంతో ప్రయోజనంగా మారనుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2,047 విజన్ అభివృద్ధి రాబోయే పౌరులకు ఎంతో ప్రయోజనంగా మారనుందని రాష్ట్ర ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర 2,047 జిల్లా స్థాయి అవగాహన సదస్సు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర మంత్రి రవికుమార్ చెప్పారు. అధికారులు బాధ్యతతో శ్రమిస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమన్నారు. …
Read More »గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్షదైవం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. వేంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. సాక్షాత్తు వేంకటనాథుడే తన అనుంగు వాహనంపై తమను దీవించేందుకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సేవలో మూల విరాట్‌ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల… తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం. గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. సౌపర్ణుడు …
Read More »ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు!
-ఏపీలో ప్రస్తుతం 1 కోటీ 48లక్షల 43వేల 671 రేషన్ కార్డులు -ఇందులో 89 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద నిత్యవసర సరుకులను అందిస్తోంది -మిగిలిన 59,43,671 రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై …
Read More »ఆలయాల్లో ప్రసాదంతోపాటు మొక్క ఇవ్వాలనే షాయాజీ షిండే ఆలోచన స్వాగతిస్తున్నాము
-రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి తో చర్చిస్తాను: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు -ముంబైలోని మూడు ఆలయాల్లో వృక్ష ప్రసాదం పంపిణీ: ప్రముఖ నటులు షాయాజీ షిండే -మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన షాయాజీ షిండే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, …
Read More »ఉయ్యూరు హనుమాన్ నగర వాసులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాను
-తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు నగర పంచాయితీ పరిధిలోని 16వ వార్డు హనుమాన్ నగర్ వాసులు తమ ఆస్తులు స్థలాలను 22A జాబితా నుండి తొలగించవలసినదిగా కోరుతూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు,స్పందించిన రాజేంద్ర ప్రసాద్ వెంటనే జాయింట్ కలెక్టరు,మరియు ఉయ్యూరు MRO తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిస్కరించవలసినదిగా కోరారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో హనుమాన్ నగర్లోని స్థలాలు …
Read More »రూ. 115కే పామాయిల్ ప్యాకెట్
– ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని రైతుబజార్లలో అందుబాటు. – జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరిగిన వంట నూనెల ధరలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 9వ తేదీ బుధవారం నుంచి అన్ని రైతు బజార్లలో రూ. 115కే పామాయిల్ ప్యాకెట్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా.. పౌరసరఫరాల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు తదితరులతో …
Read More »చివరి అంకానికి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2018,2019 సంవత్సరంలో ఉపాధిహామీ పథకంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు 530 తక్షణమే విడుదల చేయాలి అని రాష్ట్ర ఉపాధిహామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి(కృష్ణ), డా||శ్రీనివాసమూర్తి(అనంతపురం) పోతుగంటి పీరయ్య,(కడప) మొవ్వ లక్ష్మీ సుభాషిని (గుంటూరు) ఈరోజు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ యం. కృష్ణ తేజ, డైరెక్టర్ షణ్ముక్ కుమార్ ని కలిసి పెండింగ్ బిల్లులు విడుదల కోసం చర్చించడం జరిగింది. Q.C రికవరీ కింద 178 కోట్లు 21% …
Read More »జిల్లాలో 300 గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె పండుగ వారోత్సవాలు
-అక్టోబరు 14 నుంచి 20 వ తేదీ వరకు రూట్ మ్యాప్ సిద్ధం -ప్రజాప్రతినిధులు సమక్షంలో ఆయా పనులకు శంఖుస్థాపన -మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి / జిల్లా మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ తో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, …
Read More »ఈ నెల 10 న వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకోవటంలో విఫలమైన కూటమి ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ ఈ నెల 10 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసనకు పిలుపునిచ్చినట్లు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి నెల రోజులు దాటినా బాధితుల కష్టాలు తీరలేదని మల్లాది విష్ణు ఆరోపించారు. సర్వస్వం కోల్పోయిన …
Read More »