-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం చేశారన్నారు. పంట పొలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు నగదు జమ …
Read More »Daily Archives: November 19, 2024
డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం
-చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్ధత గల జర్నలిస్ట్ కథతో విన్నూత్న అంశాలతో తెరకెక్కనున్న సెటిల్ మెంట్ చిత్రం డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళుతుందని చిత్ర దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం తెనాలి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చిలక్కొట్టుడు’తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత …
Read More »టిడిఆర్ బండ్ల కమిటీ సమీక్ష సమావేశం
-టి డి ఆర్ బాండ్ల ను పారదర్శకంగా పరిశీలించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిఆర్ పనులను పారదర్శకంగా పరిశీలించారని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కమిటీ సభ్యులతో అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టిడిఆర్ బాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గుణదల, డోర్నకల్ రోడ్డు, ఎంజి రోడ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు గల ప్రాంతాలలో …
Read More »రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల తో పాటు ఈ సంవత్సరం గత నెలల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 53 …
Read More »ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పార్క్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఆటో నగర్ రోడ్, వై జంక్షన్ ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో డివైడర్లలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు …
Read More »పన్నుదార్లు సకాలంలో పన్ను చెల్లించి జిఎంసికి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పస్టం చేశారు. మంగళవారం కమిషనర్ ఆదేశాల మేరకు బృందావన్ గార్డెన్స్ లోని గంటా పున్నయ్య చౌదరి 2019 నుండి నీటి పన్ను రూ.1,5,6,365 బకాయి చెల్లించనందుకు, సిపిటి రోడ్ లోని కొత్త కాలనిలో అనధికారికంగా ట్యాప్ కనెక్షన్ పొందిన నందిగామ కోటయ్య నివాసాలకు మున్సిపల్ …
Read More »ప్రజలకు ప్రత్యేక యాప్ ద్వారా సిటిజన్ రివార్డ్ అందించేందుకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సకాలంలో పన్ను చెల్లించడం, మిద్దె తోటల పెంపకం, ఇంకుడు గుంతల ఏర్పాటు, వ్యర్ధాలను తడి పొడిగా వేరు చేసి ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే ప్రజలకు ప్రత్యేక యాప్ ద్వారా సిటిజన్ రివార్డ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ సంస్థ ప్రతినిధి సమీర్ గౌతమ్ సిటిజన్ …
Read More »12 మంది నోడల్ అధికారులకు షోకాజ్ నోటీసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్పీసిఐ సర్వే, జియో ట్యాగింగ్ పర్యవేక్షణ లోపంపై 12 మంది నోడల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) సర్వే, ఇళ్ల జియో ట్యాగింగ్ వేగవంతంపై మౌఖికంగాను, …
Read More »ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్, రోడ్ల ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని, ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలని జిఎంసి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు కొరెటెపాడు సెంటర్ నుండి గుజ్జనగుండ్ల సెంటర్ వరకు జిఎంసి చేపట్టిన డ్రైన్, రోడ్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను, గుజ్జనగుండ్ల పాల్టెక్నిక్ కాలేజీ దగ్గర వెండింగ్ జోన్ ఏర్పాటు …
Read More »ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో రహదారులు భవనాలు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు రహదారులు, ప్రహరీలు, మురికి కాలువలు తదితర నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ …
Read More »