Breaking News

ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పార్క్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కమిషనర్  ఆటో నగర్ రోడ్, వై జంక్షన్ ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో డివైడర్లలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పార్క్ విభాగ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, మొక్కల పెంపకంపై చర్యలు తీసుకోవాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. ప్రదానంగా జాతీయ రహదార్ల వెంబడి వ్యర్ధాలు వేసే వారిని గుర్తించదానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు తెలిపారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి మల్లికార్జున, ఏడిహెచ్ శ్రీనివాసరావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *