Breaking News

Daily Archives: November 23, 2024

వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీతారామపురం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీసత్య సాయి మందిరంలో నయన మనోహరమైన డెకరేషన్లతో వేలాది మంది భక్తుల శ్రీ సత్య సాయిబాబా నామస్వరణ భజనలతో వారం రోజులు పాటు అంగరంగ వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, ప్రేమలింగాభిషేకాలతో, శ్రీ సత్య సాయి వ్రతం వేద పటణం, భజనలు, స్వామివారి సందేశాలు, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, …

Read More »

ముగ్గురికి సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల‌ అందజేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యం బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవాడ‌ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ముగ్గురు ల‌బ్దిదారుల‌కి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కుల‌ను పంపిణీ చేశారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 55వ డివిజ‌న్ నైజాం గేట్ ప్రాంతంలో నివాసం వుండే షేక్ …

Read More »

విజ‌య‌వాడ అభివృద్థిలో ముస్లిం సామాజిక వ‌ర్గం ముఖ్య భూమిక పోషించింది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-లబ్బిపేట లో మ‌స్జీద్ శంకుస్థాప‌న‌ -ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గ‌ద్దె హాజ‌రు -ముస్లిం యువ‌త‌కు స్వ‌యం ఉపాధిపై అవగాహ‌న కార్య‌క్ర‌మం -ప్ర‌యోగాత్మ‌కంగా 54వ, 55వ డివిజ‌న్స్ లో ప్రారంభం -డిసెంబ‌ర్ లో అవ‌గాహ‌న స‌ద‌స్సు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ అభివృద్దిలో ముస్లిం సామాజిక వ‌ర్గం ముఖ్య భూమిక పోషించింది. విజ‌య‌వాడ అభివృద్దికి ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ ఏ విధంగా దోహ‌ద‌ప‌డిందో..ఆ రంగంలో ఎక్కువ‌గా వున్న ముస్లిం సామాజిక వ‌ర్గం కూడా విజ‌య‌వాడ అభివృద్దికి దోహ‌దం చేసింద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని …

Read More »

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్‌ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన‌ ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు . ఎంపి కేశినేని శివ‌నాథ్ కు సంస్థ నిర్వాహ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ ఎగ్జిబిష‌న్ కు విచ్చేసిన సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక మొక్క‌ను నాటారు. అలాగే ఈ …

Read More »

రాబోయే ఏడాదిన్న‌ర కాలంలో విజ‌య‌వాడ ప్ర‌ధాన స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-భారతీ నగర్ లో రూ.80 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన -శిలాప‌ల‌కం ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గ‌ద్దె విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే అభివృద్ధిపై దృష్టి సారించారు. విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో రోడ్లు రిపేర్లు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నాము..ఈ విష‌యంపై త‌రుచూ విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌తో స‌మావేశం అవుతున్నాము. రాబోయే ఏడాదిన్న‌ర కాలంలో విజ‌య‌వాడ లోని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే …

Read More »

ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల ఆక్రమణల తొలగింపుపై రాజీ లేదని, పట్టణ ప్రణాళిక అధికారులు ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొరెటెపాడు పార్క్ వెనుక డ్రైన్, రోడ్ ఆక్రమణలు సోమవారం నుండి తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు కొరెటెపాడు, విద్యా నగర్ మెయిన్ రోడ్లలో పర్యటించి, ఆక్రమణల తొలగింపుపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనుల జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు వేగంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశిచారు. శనివారం జిఎంసి మెయిన్ ఆఫీస్ లోని కమిషనర్ చాంబర్లో ఏటి అగ్రహారం రోడ్ విస్తరణలో కోర్ట్ కేసులు దాఖలు చేసిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

37వ CII ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్వాలిటీ సర్కిల్ పోటీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : BRAKES INDIA PVT LTD 37వ CII ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్వాలిటీ సర్కిల్ పోటీ 2024లో విజేతగా నిలిచింది. CII ఆంధ్రప్రదేశ్ తన 37వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్వాలిటీ సర్కిల్ పోటీని 2024 సంవత్సరానికి ఈరోజు తిరుపతిలో నిర్వహించింది. ఈ పోటీలో బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ కు చెందిన కోర్ షాప్ గెలుపొందింది. అపోలో టైర్స్ లిమిటెడ్‌కు చెందిన టీమ్ పర్పుల్ వింగ్స్ 1వ రన్నరప్‌గా నిలిచాయి మరియు అమరరాజా …

Read More »

రబీ సాగుకు రైతులను సమాయత్తం చేయుటకు వ్యవసాయ విస్తరణ సిబ్బందితో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం

-రైతుల సేవే అత్యున్నత సేవ – బాధ్యతతో సేవలు అందించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జివనానికి మూలాధారమైన ఆహారం పండించే రైతు సేవ కంటే సృష్టిలో మరేది గొప్పది కాదని వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ భాస్కరయ్య అన్నారు. రబీ సాగుకు రైతులను సమాయత్తం చేయుటకు కలెక్టరేట్లో సమావేశ మందిరంలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన సేవలను రైతులకు బాధ్యతతో, గౌరవంగా అందించాలని …

Read More »

జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం. అర్హత ప్రమాణాలు విద్యార్హత జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ వయస్సు 35 సంవత్సరాలు లోపు అనుభవం బిఎస్సి – 2 సంవత్సరాలు, …

Read More »