-వెస్ట్ లో అన్ని స్కూళ్లను అభివృద్ధి పరుస్తాం.. -ఎం ఎల్ ఎ సుజానా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు . విద్యాధరపురంలోని లేబర్ కాలనీ జి యన్ ఆర్ ఎం సి పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, ఐ ఒ టి డిజిటల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సుజనా శుక్రవారం ప్రారంభించారు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ, సుజనా …
Read More »Daily Archives: November 22, 2024
మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు
-మత్స్యకారుల జీవనోపాధులకు భరోసా ఇస్తాము -మత్స్యకార ప్రతినిధులతో సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి.. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి క్యాంపు …
Read More »నిడమర్రులో గతంలో నిలిచిపోయిన NDB రోడ్ల పనులు తిరిగి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
-మంగళగిరి నియోజకవర్గంలో నేడు NDB రోడ్ల పనులు పరిశీలించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -ప్రభుత్వం చొరవతో తిరిగి ప్రారంభమైన NDB రోడ్ల పనులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రోడ్లకు సరికొత్త రూపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఇందు కోసం దశల వారీగా రోడ్ల పనులు పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు.. మంగళగిరి …
Read More »రావి వెంకటేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. విజయవాడ గురునానక్‌కాలనీ నాక్ కళ్యాణమండపంలో శుక్రవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వెనిగండ్ల రాముకు రావి వెంకటేశ్వరరావు వెన్నంటి ఉండి పార్టీ విజయానికి కృషి చేశారని కొనియడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »కేంద్ర ప్రాయోజిత పథకాలను సాధ్యమైనంతగా రాష్ట్రానికి తీసుకువస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం గా ఎంపీలకు బాబు దిశా నిర్దేశం -తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఎంపీలందరూ హాజరయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను లోక్ సభలో …
Read More »ఎన్.టి.టి.పి.ఎస్ డస్ట్ సమస్యపై ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన రైల్వే ఉద్యోగులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి లోని ఎన్.టి.టి.పి.ఎస్ నుంచి విడుదలయ్యే డస్ట్ కారణం త్రాగునీరు, గాలి తీవ్రంగా కాలుష్యమై ఆ ప్రాంత వాసులు అనారోగ్యానికి గురి అవుతున్నారని…ఆ సమస్యను షరిష్కరించాలని కోరుతూ గుంటుపల్లిలోని రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ ఉద్యోగులు, కాలనీ వాసులు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కి వినతి పత్రం అందజేశారు. వర్క్ షాప్ కాలనీలో నివాసం వుంటున్న500 కుటుంబాలతో పాటు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గురునానక్ కాలనీలోని విజయవాడ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన ఎపి నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి శాలువాతో సత్కరించారు. ఎపి నాటక అకాడమీ ఛైర్మన్ గా నియమితులైనందుకు గుమ్మడి గోపాలకృష్ణకి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. తెలుగు నాటకాన్ని, పద్యాన్ని ఎల్లలు దాటించిన కళాకారుడిగా గుమ్మడి ఖ్యాతి పొందారని కొనియాడారు. వైసిపి దుర్మార్గపు పాలనను సాంస్కృతిక కార్యక్రమాల …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి చిత్రపటం బహుకరించారు. గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైనందుకు వీరంకి వెంకట గురుమూర్తికి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. కార్యకర్త స్థాయి నుంచి టిడిపి స్టేట్ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన జక్కంపూడి రైతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న అవుటపల్లి నుంచి కాజ వరకు నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం వల్ల జక్కంపూడి పంచాయతీలో ల్యాంక్ సంస్థ చేపట్టిన 400 కెవి పవర్ టవర్స్ షిప్టింగ్ ను వర్టికల్ గా కాకుండా తమ పొలాలకు, భూములకి ఎక్కువ నష్టం వాటిల్లే విధంగా చేస్తున్నట్లు జక్కంపూడి రైతులు ఎంపి కేశినేని శివనాథ్ కి తెలియజేశారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్లమూడి చలపతి రావు …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన విజయనగరం ఎంపి కలిశెట్టి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు కు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలకటంతో పాటు శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఆ తర్వాత కలిశెట్టి అప్పల నాయుడు ఎంపి కేశినేని శివనాథ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం వీరిరువురు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి …
Read More »