విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న అవుటపల్లి నుంచి కాజ వరకు నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం వల్ల జక్కంపూడి పంచాయతీలో ల్యాంక్ సంస్థ చేపట్టిన 400 కెవి పవర్ టవర్స్ షిప్టింగ్ ను వర్టికల్ గా కాకుండా తమ పొలాలకు, భూములకి ఎక్కువ నష్టం వాటిల్లే విధంగా చేస్తున్నట్లు జక్కంపూడి రైతులు ఎంపి కేశినేని శివనాథ్ కి తెలియజేశారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్లమూడి చలపతి రావు ఆధ్వర్యంలో జక్కంపూడి రైతులు ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు. ఇదే కారిడార్ లో ట్రాన్స్ కో సంస్థ వర్టికల్ గా తక్కువ పవర్ టవర్స్ తో రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా షిప్టింగ్ చేసినట్లు తెలిపారు. అలాగే ల్యాంకో సంస్థ రైతులకి ఎలాంటి నష్టం వాటిల్లికుండా పవర్ టవర్స్ షిఫ్టింగ్ చేసే విధంగా చూడాలని కోరారు. రైతుల అభ్యర్ధన ఎంపి కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి పంచాయతీ రైతులు మీసాల నాగమల్లేశ్వరరావు, మంతెన సత్యనారాయణరాజు, రావి శివరామకృష్ణయ్య, నిమ్మగడ్డ శివజోగేశ్వరరావు, ఆలూరు సత్యనారాయణ, సిరిపురుపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News