విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి శాలువాతో సత్కరించారు. ఎపి నాటక అకాడమీ ఛైర్మన్ గా నియమితులైనందుకు గుమ్మడి గోపాలకృష్ణకి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. తెలుగు నాటకాన్ని, పద్యాన్ని ఎల్లలు దాటించిన కళాకారుడిగా గుమ్మడి ఖ్యాతి పొందారని కొనియాడారు. వైసిపి దుర్మార్గపు పాలనను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఎండగట్టారని పేర్కొన్నారు. తనకి అభినందనలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ కు గుమ్మడి గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News