Breaking News

Daily Archives: November 25, 2024

నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక గుర్తింపు

-కేంద్ర మంత్రి నుండి సంయిక్తంగా దృవీకరణ అందుకున్న రేఖారాణి, నాగరాణి డిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక (జిఐ) ధృవీకరణ అందుకోవటం సంతోష:గా ఉందని రాష్ట్ర్ర చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భౌగోళిక సూచితో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి …

Read More »

Andhra Pradesh “Yuva Sangam” starts for Uttarpradesh

Vijayawada, Neti Patrika Prajvartha : Under Ek Bharat Shreshtha Bharat, “Yuva Sangam” from Andhra Pradesh wason boarded to Uttar Pradesh today. Yuva Sangamhas been formed with the representation of School of Architecture and Planning (SPA), Vijayawda.It consists of 42 members of students from various state, central universities and colleges across the state of Andhra Pradesh. This Sangam isscheduled for a …

Read More »

రూ.861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి

-1307 కి.మీ పొడవైన 18 స్టేట్ హైవేలను పిపిపి పద్దతిలో నిర్మించేందుకు నిర్ణయం -నరేగా నిధులతో గ్రామాల్లో 13 వేల కి.మీ అంతర్గత రోడ్లు నిర్మాణం -ఆర్ అండ్ బి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రూ.861 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రోడ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నవంబర్ 2వ తేదీన అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని …

Read More »

శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు : సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలం – హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని అధికారులు …

Read More »

ప్రతి ఇళ్లూ, కార్యాలయం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి

-సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారుడు అదనంగా ఆదాయం పొందే అవకాశం -కేంద్ర కార్యక్రమాలైన పిఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా గరిష్ట లబ్ది పొందాలి -ప్రతి ప్రభుత్వ కార్యక్రమం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా మార్చాలి:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రాష్ట్రంలో సౌరవిద్యుత్ కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతీ ఇళ్లూ, ప్రతీ కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్ ఉత్పత్తి – వినియోగంలో స్వావలంభన సాధించే దిశగా …

Read More »

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

-విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి -ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన -తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి -సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ …

Read More »

నగరంలో ఏపీ 108 సర్వీస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ధర్నా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏపీ 108 సర్వీస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ధర్నా జరిగింది. సోమవారం ధర్నాచౌక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎ స్‌ లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించడంతో పాటు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు …

Read More »

నేడు రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వతేది మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆప్ ఇండియాను అడాప్ట్ చేసుకోగా 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈనెల 26వతేదికి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ 75వ …

Read More »

డిశంబరు 31 నుండి సింగిల్ విండో విధానం ద్వారా భవననిర్మాణ అనుమతులు

-ఇకపై భవన నిర్మాణ అనుమతులకై పలు శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు -భ‌వ‌నాలు,లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం -15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ నిర్మించే భ‌వ‌నాలకు ప్లాన్ అనుమతులు అవ‌స‌రం లేదు -టిడిఆర్ అంశాలపై 15 రోజుల్లో పూర్తి స్థాయి సమీక్ష -అమృత్ 2.0ను రెండేళ్ళలో పూర్తి చేయాలని సియం ఆదేశాలు -మెప్మా సభ్యుల అభ్యున్నతికి పి-4 విధానంలో తగిన చర్యలు -రాజధానిలో ఐకానిక్ భవన నిర్మాణాల పనులు త్వరలో మొదలవుతాయి -రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు పి.నారాయణ …

Read More »

రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారభం

-మౌలిక వసతులు కల్పిస్తాం..డోలీ మోతలు తప్పిస్తాం… -రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలికినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన గిరి ఆరోగ్య కేంద్రం (కంటైనర్ ఆసుపత్రి)ను సోమవారం ఉదయం …

Read More »