Breaking News

Daily Archives: November 25, 2024

ఎన్ఎస్ఎస్ విద్యార్ధులకు ప్రశంసా పత్రాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరు సాధనలో నగర యువత పాత్ర కీలకమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. స్వచ్చత హి సేవాలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన సైక్లింగ్, 2కెవాక్, స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను సోమవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో స్వచ్చత హి సేవా …

Read More »

ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103, 104, 105 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత తమ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల …

Read More »

అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ సంగడిగుంట, శారదా కాలనీల్లో సిసి రోడ్ల ప్యాచ్ వర్క్ లు, నూతన డ్రైన్లను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు …

Read More »

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి

-ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.. -తప్పిదాలకు తావులేని ఓటర్ల జాబితా తయారీ పై దృష్టి సారించాలి. -పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితాను దోషరహితగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్రపశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి ఎస్ ఎస్ ఆర్ 2025 …

Read More »

మెగా పేరెంట్ మీటింగ్ ని విజయవంతం చేయండి…

-విద్యా శాఖ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ -జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బోతున్న మెగా పేరెంట్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యాశాఖా ధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విషయమై అంశాలను వివరించాలన్నారు . తల్లిదండ్రులకు వార్డు పెద్దలకు ఆహ్వాన పత్రాలను ముందుగానే …

Read More »

డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసులను సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా …

Read More »

“మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన” పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్త ఆధ్వర్యంలో “మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన” పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ అనేక మంది అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీకి గురవుతున్నారని అన్నారు. ఈ …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్‌ ను ఆవిష్కరించిన..

-ఎస్బిఐ ఖాతా నెంబరు 62064060623 IFSC కోడ్ SBIN0020974 జమ చెయ్యండి -అందించే విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లాగ్ దినోత్సవం సందర్భంగా వితరణ అందించి తమ వంతు దేశభక్తిని చాటాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్‌ ను కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి …

Read More »

సివిల్స్ ఉచిత శిక్షణ కొరకు ప్రవేశ పరీక్షా కొరకు నవంబర్ 27 న ఇంటర్వులు

-బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కే ఎన్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు, వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నవంబర్ 27 బుధవారం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కే ఎన్ జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాలని …

Read More »

విభిన్న ప్రతిభావంతురాలు నాగులపల్లి ఆదిలక్ష్మికి ట్రై సైకిల్స్ అందజేసిన..

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో దరఖాస్తు చేసిన వెంటనే నాగులపల్లి ఆదిలక్ష్మికి ట్రై సైకిల్ అందచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం 45వ వార్డులో నివాసముంటున్న మానసిక దివ్యాంగురాలు నాగులపల్లి ఆదిలక్ష్మికి రు. 8,500 రూపాయలు విలువ గల ట్రై సైకిల్ ను అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు …

Read More »