రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారము తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసులను సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. క్రిమినల్ కేసులు కి సంబంధించి బెయిల్ కోసం వేసిన అర్జీల వివరాలు తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News