తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి 16.12.2024 సోమవారం నాడు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఆదివాసి అభివృద్ధి సంస్థ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ముద్రించిన బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులు, ఎన్ జి ఓ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి …
Read More »Daily Archives: December 16, 2024
కన్నుల పండుగగా కాశీ అన్నపూర్ణేశ్వరి
-తంధులాభిషేకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పాత శివాలయంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి 12,108 కేజీల బియ్యంతో నిర్వహించిన తంధు లాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులనుంచి బియ్యాన్ని సేకరించి మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో అన్నదానం చేశారు. ద్వారావతి ఫౌండేషన్ ఆహ్వానం మేరకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి సోమవారం అభిషేకంలో పాల్గొని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరికి తంధులాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ద్వారావతి …
Read More »హనుమంతరాయ చేపల మార్కెట్ అభివృద్ధికి కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు హనుమంతరాయ చేపల మార్కెట్ లోని డ్రెయిన్లు, తాగునీటి కుళాయిలను ఏర్పాటుచేసి మార్కెట్ ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన సంబంధిత అధికారులతో కలిసి సోమవారం 53 వ డివిజన్ లోని హనుమంతరాయ చేపల మార్కెట్, కొత్తపేట, గులాం మొహిద్దిన్ స్ట్రీట్, తదితర ప్రాంతాలలో పర్యటించారు. చేపల మార్కెట్ లో త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ప్రవేశ …
Read More »SAMP-1 పరీక్ష పేపర్లు ఉన్నత పాఠశాలకు నేరుగా ఇవ్వాలి
-యూటీఎఫ్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్17, 18, 19, 20 తేదీలలో ఉన్నత పాఠశాలలో జరగబోయే SAMP పరీక్ష పేపర్లను ఉదయము మరియు సాయంత్రం ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్ కి గంట ముందు వెళ్లి పేపర్లు తెచ్చుకుని పరీక్ష నిర్వహించాలి అని ఉన్నత అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కె యస్ యస్ ప్రసాద్ ఖండించారు. పరీక్ష పేపర్లు లీకవుతున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి ముందుగానే తీసుకువెళ్ళినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. …
Read More »పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భముగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిని అనుసరించి ప్రాజెక్ట్ నిర్మాణం పనులను చాలా ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి స్పీల్ వే ని ఆసక్తిగా పరిశీలించి స్వయంగా తన సెల్ ఫోన్ లో ఆ చిత్రాలను బందించారు.
Read More »జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవం సోమవారం విద్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించి స్ఫూర్తిదాయకమైన ప్రభావశీలుర విజయ గాధలు వివరించి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఐఏఎస్ అధికారి జయ గణేశన్ తదితరులు జీవితంలో ఏ విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించారో కలెక్టర్ వివరిస్తూ విద్యార్థులు …
Read More »విషయ జ్ఞానం పెంపొందించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టెక్స్ట్ బుక్ చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది, కావున టెక్స్ట్ బుక్స్ లను చదవటం అలవాటు చేసుకోవాలని, విషయ జ్ఞానం పెంపొందించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. అఖిల భారత చేతి వ్రాత & గ్రాఫాలజీ అసోసియేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 2024 జులై 14న దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయస్థాయి చేతిరాత పోటీలలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. …
Read More »విజయ దివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్రం విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని పటమట హై స్కూల్ నందు విజయ దివాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ కోసం మన భారత సైన్యం పోరాట ప్రతిభను పరాయి దేశం కోసం సైన్యం త్యాగాన్ని ఎలా చేసిందో అనే అంశాలపై విద్యార్థులకు జిల్లా యువ అధికారి సుంకర రాము వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ …
Read More »క్షయ పై వందరోజుల అవగాహనా శిబిరాలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ లేని భారదేశం కోసం కేంద్రప్రభుత్వం తలంప పెట్టిన వందరోజుల అవగాహనా శిభిరాలకు అనుగుణంగా యన్.టి.ఆర్ జిల్లా క్షయ నియంత్రణా విభాగం, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఆటోనగర్ నందు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐలా చైర్మెన్ సుంకర్ దుర్గాప్రసాద్ ఐ.ఈ.సి స్టాల్ ను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ సంయుక్త ఆద్వర్యంలో ఆటోనగర్ కార్మికులకు చేస్తున్న సేవలకు గాను …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (public grievance redressal system) కు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని, జిల్లా, డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో మరింత యాక్టివ్ గా పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం డిఆర్వో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు …
Read More »