Breaking News

Daily Archives: December 29, 2024

వేడుకలు ఆమోదయోగ్యం–ఆహ్లాదకరంగా-ఆరోగ్యంగా-హానిరహితంగా ఉండాలి…

-విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు , ఐ. పి. ఎస్.  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రజలకు, పోలీస్ సిబ్బంది మరియు అధికారులు యన్.టి.ఆర్. జిల్లా పోలీసు కమిషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు , ఐ. పి. ఎస్.  2025 వ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిoచుకొనే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకొని ఆంక్షలు తప్పని సరి చేయటమైనది. …

Read More »

వీఆర్వోలపై పని వత్తిడి తగ్గించాలి… : భూపతిరాజు రవీంద్ర రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం జరిగింది. వీఆర్వోలపై అధిక పని వత్తిడి ఉందని, దీనికితోడు ఇతర శాఖ అధికారులు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తుండటంతో వారు మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు కోరారు. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రవీంద్ర రాజు …

Read More »

మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు

-రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో కలిసి నగరంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులతో కలిసి మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు, కుమ్మరిగూడెంలోని ఖాళీ ప్రదేశం, పోతేపల్లి జ్యువెలరీ …

Read More »

రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు

-వరదల కాలంలో గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన -గోదావరిలో వరదల సమయంలో 280 టిఎంసిల నీటిని కృష్ణాడెల్టాకు, సీమకు తరలించేందుకు ప్రణాళిక -80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు -దాదాపు రూ.70,000 – 80,000 కోట్ల ప్రాజెక్టు తో రాష్ట్రానికి జలహారతి -ఇరిగేషన్ శాఖపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి…రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి …

Read More »

నాబార్డు అధ్వర్యంలో రొయ్యల ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబరు 30 న రాజమహేంద్రవరం లో రాష్ట్ర మత్స్య శాఖ సహకారంతో నాబార్డు అధ్వర్యంలో రొయ్యల ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ ఏ జి ఎమ్ ,- వై ఎస్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాజమండ్రిలోని లా హాస్పిన్ హోటల్‌లో 30 డిసెంబర్ 2024 సోమవారం  ఉదయం 10.00 గంటలకు రొయ్యల పెంపకంపై ‘అవగాహన కార్యక్రమాన్ని’ నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ సి జి ఎమ్ …

Read More »

ఘనంగా శారద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

-వెయ్యి మందికి పైగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు -పూర్వ అధ్యాపకులకు సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని శారదా క‌ళాశాల‌ స్వర్ణోత్సవ వేడుకలు, నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహ భరితంగా జరిగింది. శారద కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులు, పూర్వ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గత యాభై ఏళ్ళ లో చదువుకున్న విద్యార్థులు నేడు ఎంతో మంది ఉన్నత స్థానంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వివిధ రంగాలకు చెందిన 18 మంది సభ్యులతో రాష్ట్ర సలహా కమిటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) వివిధ రంగాలకు చెందిన 18 మంది సభ్యులతో రాష్ట్ర సలహా కమిటీ (SAC)ని ఏర్పాటు చేసింది మరియు శనివారం అధికారిక గెజిట్ ప్రచురించబడింది. SAC పదవీకాలం గెజిట్ ప్రచురణ తేదీ నుండి మూడు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ, నాణ్యత, కొనసాగింపు మరియు లైసెన్సుదారులు అందించే సేవల పరిధి, లైసెన్స్‌కు అవసరమైన షరతులతో లైసెన్స్‌దారులు పాటించడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, విద్యుత్ సరఫరా మరియు మొత్తం ప్రమాణాలపై APERCకి సలహా ఇవ్వడం …

Read More »

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళా 2024 లో ఆదివారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ విజయవాడలో 100కు పైగా స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకాలు చేస్తున్న శుభ సందర్భంలో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అతి తక్కువ …

Read More »

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ రాష్ట్ర సంఘానికి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న చౌదరి పురుషోత్తమ నాయుడు ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ పదవికి కో ఆప్షన్ విధానంలో జరుగుతున్న ఎన్నికలకు ప్రస్తుత కృష్ణాజిల్లా అధ్యక్షులు, గత మూడు దశాబ్దాలుగా ఏపీఎన్జీజీవో సంఘంలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఎ. విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శిగా పోటీలో ఉన్నారని విజయవాడ నగర …

Read More »

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో చెస్ క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో స‌త్తాచాటుతున్నార‌ని.. అలాంటి విజేత‌ల‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. ఆదివారం విజ‌య‌వాడ‌, కృష్ణ‌లంక‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో జ‌రిగిన స్టేట్ ర్యాంకింగ్ చదరంగం పోటీల సంరంభానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. దాదాపు 350 మంది క్రీడాకారులు, 200 …

Read More »