శారదనగర్(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరం 31వ డివిజన్ శారదానగర్ లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. వీరవల్లి బసవ నాగేంద్రమ్మ, అనిశెట్టి శేషగిరిరావు, గంజల శశిరేఖకు వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ గంగపుత్రుని వినయ్ కుమార్ కు నూతనంగా మంజూరైన రూ.10వేలు …
Read More »Daily Archives: December 31, 2024
తాగునీటి పథకాల పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా, తాగునీటి పథకాల పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ లో ఆర్డబ్ల్యూఎస్, గనులు, ఎపి విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థల ద్వారా పార్లమెంటు సభ్యుని నిధులు, సి ఎస్ ఆర్ నిధులు, డిస్టిక్ మినరల్ ఫండ్, నాబార్డ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »మత్స్యకారులకు బోటు రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందజేసిన కలెక్టర్
-ఇచ్చిన హామీ నెరవేర్చిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్ లోని తమ చాంబర్ నందు 17 మంది మత్స్యకార బోటు యజమానులకు మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందజేశారు. గత సెప్టెంబర్ మాసంలో విజయవాడలో వరద ముంపు బాధితులను రక్షించేందుకు అత్యవసరంగా బోట్లు అవసరం కాగా, జిల్లా కలెక్టర్ వెంటనే మంగినపూడి బీచ్ ఉప్పాడ పాకలు ప్రాంతం వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి వారి బోట్లను లారీలలో విజయవాడ ఆఘమేఘాల మీద …
Read More »ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ షాపుల మార్జిన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం -రూ.99 లకు మద్యంతో పాటు, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలన్న సిఎం -బెల్ట్ షాపులపై కఠిన వైఖరి-టెక్నాలజీ ద్వారా మద్యం అమ్మకాలు ట్రాక్ చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో …
Read More »బొకేలు వద్దు బుక్కులు ముద్దు
-న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు పూల బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి కందుల దుర్గేష్ -పేద విద్యార్థులకు ఉపయోగపడేలా బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఇతరత్రా సామాగ్రిని తేవాలంటూ సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు వందల రూపాయలు ఖర్చు చేసి కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని దానికి బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పెన్నులు, బాక్సులు తదితర సామాగ్రిని …
Read More »తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నాను. 2024లో సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలను ఆవిష్కృతం చేశాం. పేదవాడి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం …
Read More »కొత్త సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ, యువతకు గౌరవప్రదమైన జీవితం ఖాయం
-2024 సంవత్సరం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి -ఫీనిక్స్ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోంది -రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులొస్తున్నాయి -2024కు వీడ్కోలు, 2025కు స్వాగతం పలుకుతూ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం, యువతకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం ఖాయమని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బూడిద కుప్పల నుంచి ప్రాణం పోసుకునే ఫీనిక్స్ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోందని పేర్కొన్నారు. …
Read More »పేదలకు కూటమి ప్రభుత్వం భరోసా
సాలూరు (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో ఎన్ టి ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు వేల పింఛను ను నాలుగు వేల రూపాయలకు పెంచిందని తెలిపారు. నూతన సంవత్సరం సందర్బంగా ఒక రోజు ముందే పింఛను పంపిణి …
Read More »ఇంటి వద్దే పింఛన్లపై టెక్నాలజీ సాయంతో పర్యవేక్షణ
-లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పెన్షన్ పంపిణీ తీరు పరిశీలన -లబ్దిదారుల సంతృప్తే ముఖ్యం అన్న ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకు టెక్నాలజీ వినియోగం -12 గంటల సమయానికల్లారాష్ట్రంలో 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి -మొత్తం 91 శాతం పెన్షన్ల పంపిణీలో 93 శాతం మంది లబ్దిదారులకు ఇంటి దగ్గరే అందజేత -మిగిలినవాళ్లకు సిగ్నల్స్ సమస్య కారణంగా ఇంటికి 300 మీటర్ల దూరంలో పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని అత్యంత పక్కాగా నిర్వహించేందుకు …
Read More »కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి..
-జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభవేళ జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని.. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు మరింతగా ఆర్థికంగా బలపడేందుకు, ఆరోగ్యకర జీవితానికి ఈ …
Read More »