Breaking News

Monthly Archives: January 2026

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో గ్రామీణ భారతానిది కీలక పాత్ర : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

-గ్రామీణ జీవనోపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘వీబీ – జీ రామ్ జీ’ దోహదం -విజయనగరంలో పాత్రికేయుల కోసం పీఐబీ (PIB) విజయవాడ ‘వార్తాలాప్’ నిర్వహణ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో గ్రామాలను భాగస్వామ్యం చేసేందుకు కొత్తగా తెచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్’ (VB G RAM G) ఎంతో దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (విజయవాడ) …

Read More »

కృష్ణ యూనివర్సిటీ విమెన్ నెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో కృష్ణ యూనివర్సిటీ విమెన్ నెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు జనవరి 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయి అని తెలిపారు. పోటీలలో జిల్లా లోని వివిధ కళాశాల ల నుండి క్రీడాకారుల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. విజేతలుగా యస్ అర్ ఆర్ అండ్ సి వి ఆర్ …

Read More »

సంక్లిష్టమైన పరిస్థితిని దాటుకుని సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత…

-సచివాలయం మంత్రి ఛాంబర్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుండి పని చేస్తుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యర్థనలు పాలనకు మార్గదర్శకమని ఆయన వెల్లడించారు. ప్రజలకు మరింత చేరువ కావడమే ప్రజాదర్బార్ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమకు ఎదురవుతున్న వివిధ …

Read More »

ప్ర‌యాణికుల భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌సక్తే లేదు

– అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే – ప్ర‌యాణికుల ప‌ట్ల మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాలి – నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు త‌ప్ప‌వు – అధిక ధరలు వసూలు చేస్తే కేసులు న‌మోదు – సంయుక్త ర‌వాణా క‌మిష‌న‌ర్ (జేటీసీ) ఎ.మోహ‌న్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌యాణికుల భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని, ప్ర‌యాణికులప‌ట్ల మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాల‌ని, వాహ‌నాల్లో తప్ప‌నిస‌రిగా అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందేనని.. సంయుక్త ర‌వాణా క‌మిష‌న‌ర్ (జేటీసీ) ఎ.మోహ‌న్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌టన‌లో తెలిపారు. సంక్రాంతి పండ‌గ …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో జరిమాన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-3 కార్యాలయం పటమట నందు సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 22 కేసులపై విచారణ జరిపి వారికి Rs.5,410/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహణ తో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం అయోధ్యనగర్, కొత్త ఆర్ఆర్ పేట, దర్శిపేట మరియు లబ్బీపేట ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో …

Read More »

పిపిపికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు

-వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ దుర్మార్గం -3 సార్లు టెండర్లు ఆహ్వానించినా నిరాదరణ -ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ సామూహిక నిరసన దీక్షల్లో నేతలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలకు వైద్యవిద్య, వైద్యం దక్కాలంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను (పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌షిప్‌) విధానంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకతీతంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్‌లో శుక్రవారం ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ …

Read More »

రాబోయే కాలంలో టూరిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశే నెంబ‌ర్ వ‌న్ డెస్టినేష‌న్ : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-పున్న‌మి ఘాట్ లో అమ‌రావ‌తి – ఆవ‌కాయ ఫెస్టివ‌ల్ ప్రారంభోత్స‌వం విజ‌య‌వాడ, , నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్ర‌బాబు నాయుడు సంక‌ల్పం, నిరంత‌ర కృషి తో రాబోయే కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజానికి నెంబ‌ర్ వ‌న్ డెస్టినేష‌న్ గా మారుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌దీ తీరాల్లో హౌస్ బోట్స్ టూరిజంకు కృషి చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, టీమ్ వ‌ర్క్స్ ఆర్ట్స్ సంయుక్త‌నిర్వ‌హ‌ణ‌లో నిర్వ‌హిస్తున్న అమ‌రావ‌తి …

Read More »

కళా, సాంస్కృతిక, సాహిత్య, సినిమా, పర్యాటక పునరుజ్జీవనానికి వేదిక ‘ఆవకాయ్ ఫెస్టివల్’

-ఏపీని ప్రపంచ సృజనాత్మక రాజధానిగా మారుస్తాం: మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర కృష్ణా నది తీరాన నిర్వహిస్తున్న ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి,కళా, సాహిత్య, సినిమా, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి *కందుల దుర్గేష్* ఆకాంక్షించారు. గురువారం విజయవాడలో జరిగిన ఆవకాయ్ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా మరియు జానపద సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పించడమే ఈ …

Read More »

కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పెద్ద హరివాణం గ్రామాన్ని మండలంగా మార్చాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పెద్ద హరివాణం గ్రామంనీ మండలంగా ప్రకటించాలని గ్రామ పెద్దలు తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పెద్ద హరివాణం మండలం సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ పెద్ద హరివాణo గ్రామాన్ని మండలంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులను, అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. పెద్ద హరివాణం మండలం గతంలో గ్రామంని …

Read More »