విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాలలో కృష్ణ యూనివర్సిటీ విమెన్ నెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు జనవరి 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయి అని తెలిపారు. పోటీలలో జిల్లా లోని వివిధ కళాశాల ల నుండి క్రీడాకారుల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. విజేతలుగా యస్ అర్ ఆర్ అండ్ సి వి ఆర్ కాలేజీ నెట్ బాల జట్టు ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో విజయ ఫిజికల్ ఎడ్యుకేషన్ నున్న,తృతీయ స్థానం లో ఆంధ్రా లయోలా కళాశాల జట్లు నిలిచాయి. న్యాయ న్యాయ నిర్లేతలుగా డాక్టర్ స్వామి ఎల్ హెచ్ ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ,డాక్టర్ సంగీత రావు సెలెక్షన్ కమిటీ మెంబర్ ,స్టెల్లా కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు సునీత ,కోచ్ రాజా ,సెలెక్షన్ కమిటీ మెంబర్ డి.నవీన్ కుమార్ మరియు టీం మేనేజర్లు కోచ్ లు క్రీడాకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News