-సచివాలయం మంత్రి ఛాంబర్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుండి పని చేస్తుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యర్థనలు పాలనకు మార్గదర్శకమని ఆయన వెల్లడించారు. ప్రజలకు మరింత చేరువ కావడమే ప్రజాదర్బార్ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమకు ఎదురవుతున్న వివిధ అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రతి అభ్యర్థనను శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News