అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2025కు వెళ్లే యాత్రికులకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ పెషీ కార్యాలయంలో సమీక్ష జరిగింది. మదనపల్లె శాసనసభ్యుడు షాజహాన్ పాషా, గుంటూరు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ తోపాటు మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల అధిపతులతో హజ్ యాత్ర ఏర్పాట్లకు సంబంధించి మంత్రి ఫరూక్ చర్చించారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నదని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో హజ్ యాత్రకు వెళ్ళే వారి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఫరూక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికుల కోసం అమలు చేస్తున్న రూ.లక్ష రాయితీ సౌకర్యాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకుకోవాలని పేర్కొన్నారు.హజ్ యాత్రకు వెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లపై ఆలస్యానికి తావివ్వకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యాచరణ బద్ధంగా చర్యలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల అధిపతులకు మంత్రి ఆదేశించారు.
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …