Breaking News

అధికారులతో 3 వంతెనల రాకపోకల నిలిపివేత, ప్రత్యామ్నాయ చర్యలపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అరండల్ పేట నుండి కొత్తపేట వైపు వెళ్లే ప్రధాన మార్గమైన 3 వంతెనల వద్ద రైల్వే శాఖ నూతన ట్రాక్ ఎక్స్ టెన్షన్ పనుల వలన ఈ నెల 25 నుండి 60 రోజుల పాటు రాక పోకలు నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రైల్వే, ట్రాఫిక్, ఆర్&బి, జిఎంసి అధికారులతో 3 వంతెనల రాకపోకల నిలిపివేత, ప్రత్యామ్నాయ చర్యలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే శాఖ 3 వంతెనల దగ్గర నూతన ట్రాక్ ని ఎక్స్ టెన్షన్ చేయడానికి చర్యలు తీసుకుంటుందని, సదరు పనులను చేపట్టడానికి 60 రోజుల పాటు 3 వంతెనల మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని రైల్వే అధికారులు కోరారన్నారు. కనుక నగర ప్రజలు గమనించి, నెహ్రు నగర్ గేటు, శంకర్ విలాస్ వంతెన వైపు నుండి కొత్తపేటకు వెళ్లాలని సూచించారు. ఆర్&బి అధికారులు శంకర్ విలాస్ వంతెన పై రోడ్ ప్యాచ్ వర్క్ లను చేపట్టాలని, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిఎంసి ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఆర్&బి డిఈఈ చిన్నయ్య, పశ్చిమ ట్రాఫిక్ సిఐ సింగయ్య, రైల్వే ఏడిఎన్ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *