Breaking News

జిల్లాలో శాఖల వారి చేపట్టి ప్రగతి లక్ష్యాల సాధించాలి

-రెండోవ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై శాఖల వారీగా సమీక్ష
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా పనులు, సంక్షేమ శాఖల పనితీరు పై శాఖల వారిగా రెండోవ 100 రోజుల కార్యాచరణ అమలుకై నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్య శాఖ, మైక్రో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, డి ఆర్ డి ఎ, తదితర శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న ప్రగతి లక్ష్యాల పురోగతి పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత నివ్వాలన్నారు.  వ్యవసాయ రంగంలో చేపట్టిన కార్యక్రమాల లక్ష్య సాధన సకాలంలో పూర్తి చేయాలన్నారు. భూసార పరీక్షలు, వరితో పాటు ఇతర అంతర పంటలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులను రుణాలు మంజూరు, రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరచే విధంగా ఋణాల లక్ష్యల ప్రగతిని సాధించాలన్నారు. జిల్లాలో మామిడి, అరటి, కోకో పండ్ల తొటల ప్రగతి పై సమీక్షించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన అంతర్గత రహదారులు, అనుసంధాన రహదారుల నిర్మాణం, నిడదవోలు పట్టెంపాలెం రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించాలన్నారు. రోడ్లు భవనాలు శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతి పై సమీక్షిస్తూ జిల్లాలో రహదారుల అభివృద్ధికి గాను రు. 10 కోట్లతో 120 పనులు మంజూరు కాగా 46 పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తికాగా 19 గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయని , 6 పనులు పూర్తయ్యాయన్నారు. డ్రైన్స్, కల్వర్టర్స్ సంబంధించిన రు. 15 కోట్లతో 74 పనులు మంజూరు కాగా టెండర్లు ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ ద్వారా చేపట్టి చేస్తున్న పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రగతి చేపట్టిన పనులను, రెండోవ 100 రోజుల లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలి అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రంలో జిల్లా ముఖ్యా ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గెష్, జిల్లా హార్టికల్చర్ అధికారి బి . సుజాత కుమారి, డిఆర్డిఎ పిడి ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *