తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో రాష్ట్ర స్థాయి హిందీ కార్యశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఉపకులపతి ఆచార్య జి ఎస్ కృష్ణ మూర్తి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ హిందీ భాష రాజ్య భాష అని, దేశాన్ని కలిపే భాష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా హిందీ పండితులు వేద్ ప్రకాష్ బోర్కర్, లతా మంగేష్ ల చేత హిందీ నుండి ఆంగ్లం లోకి అనువాదానికి ఉపయోగపడే ఈ టూల్స్ లను హాజరు అయిన సభ్యులందరికీ వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యువ జన అధికారులు, గణాంక అధికారులు, యువ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
-జిల్లాలో ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తాం -ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి …