మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ శాఖ రైతు సేవాకేంద్రం సిబ్బందికి జిల్లా స్థాయిలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో లో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ రైతుసేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది రైతులకి సేవాభావంతో సేవలందించాలని కోరారు.. సిబ్బంది సా0కేతిక అంశాలని వృత్తి సామర్థ్యం లో రైతులకి వివరించి వారి వృద్ధికి సాయపడాలని కోరారు. రైతులతో గౌరవప్రదంగా మెలగాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వీడి రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు. విధులలో వహిస్తే కఠిన చర్యలకి వెనకాడమని హెచ్చరించారు.
తరవాత ప్రస్తుత రబికాలంలో ఈ పంట నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సాంకేతికత అధికారి హరిత వివరి0చారు. పంట భీమా, పియం కిసాన్ గురించి సరళ, గాయత్రీ సిబ్బంది కి వివరించారు. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ పై జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ వివరించారు. మధ్యాహ్నం టెక్నికల్ సెషన్ లో వరి పంట సాగులో పరిమితంగా రసాయనాల వినియోగం పై ప్రా0తీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన అధిపతి Dr” మురళీకృష్ణ రైతులకి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమ0 లో సిబ్బందితో పాటు జిల్లా వనరుల కేంద్రం ట్రైనింగ్ కాలేజీ ఆర్డినేటర్ భాస్కరయ్య, ఎ డి ఎ లక్ష్మి దేవి, ఎ ఓ లు వేణుగోపాలరావు, శ్రీనివాస్, శశికళ పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …