Breaking News

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది. 26.11.2024 మంగళవారం నాడు మచిలీపట్నం లోని పోతేపల్లి లో గల “ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి.నరేష్ కుమార్ మరియు మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ ఎ.జితేంద్ర కుమార్ గారు సంయుక్తంగా తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో, విజేతా గోల్డ్ కవరింగ్స్ వర్క్స్, రవి ఇంజెక్షన్ మౌల్డింగ్ వర్క్స్ మరియు మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి నుండీ టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ మరియు ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.8,000/- నుండి రూ.20,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని నవంబర్ 26న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 99664 89796 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలోని పూడిక తీత పనులు వేగవంతం చేసి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *