Breaking News

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం…

-తేజస్వి పొడపాటి, చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి హరిత బెర్మ్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవచేయడానికి చాలా మంది ఆలోచిస్తున్నారన్నారు. అలా నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి ఆశయాలకు ఆకర్షితులైన వ్యక్తి గా నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషమన్నారు. పదవికి ప్రొఫెషనలిజమ్ ను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. వందల మంది ప్రొఫెషనల్స్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని.. ఇది వారందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నానన్నారు. ఐటీ ఉద్యోగులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ ఎక్కువ సమయం పనిచేస్తారన్నారు. ప్రొఫెషనల్స్ కు ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకే రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని.. ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ను రాజకీయాల్లో ఎలా తీసుకురావాలో ఆలోచిస్తామన్నారు. నాకు వచ్చిన పదవి ప్రొఫెషనల్స్ కు ఇచ్చిన గౌరవంగా భావిస్తానన్నారు. ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో పని చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మన సంస్కృతి, సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తానన్నారు. దేశ, విదేశాల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం మనపై ఉందని దీనికి సాంకేతికతను జోడించాల్సి అవసరం ఉందని. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కష్టించి పనిచేస్తానన్నారు.

ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ ఐటీ రంగంలో రాణించి… రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హైద్రాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఉన్న గౌరవాన్ని తెలిపిన ఐటి ప్రొఫెషనల్స్ సభ సక్సెస్ కావడంలో ముందున్న వ్యక్తి తేజ్వస్విని అని అన్నారు. రాబోయే రోజుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసి ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఎనలేని అభిమానమన్నారు.. కల్చర్ క్వీన్ గా తేజస్విని పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళలు, సంస్కృతికి పెట్టింది పేరన్నారు. ఐటీ రంగానికి చెందిన తేజస్విని సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా సృజనాత్మకతను వెలికితీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తారని భావిస్తున్నా అన్నాను. సాంస్కృతి వైభవం కోసం తేజస్విని, జానపద కళల కోసం గుమ్మడి గోపాల కృష్ణ ఇరువురూ కలిసి పని చేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్ వైభవం తెచ్చేలా కృషి చేస్తారన్నారు.జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తేజస్విని పొడపాటి తో చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అశోక్ బాబు, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, కామినేని శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ జెట్పీ చైర్ పర్సన్ గద్దే అనురాధ, మాల్యాద్రి, పట్టాభిరమ్, ఆనం వెంకటరమణ రెడ్డి, ఎం‌పి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎం‌ఎల్‌ఏ కృష్ణ రంగా రావు, ఎం‌ఎల్‌సి దువ్వాడపూ రామరావు, నాయకులు జె జనార్ధన్ రావు, బాల కోటయ్య, ఎక్స్ ఎం‌పి కనకమెడల రవీంద్ర మరియు సి‌ఈ‌ఓ శ్రీనివాస్ తదితరలు చైర్ పర్సన్ ను అభినందించిన వారిలో ఉన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *