గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనుల జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు వేగంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశిచారు. శనివారం జిఎంసి మెయిన్ ఆఫీస్ లోని కమిషనర్ చాంబర్లో ఏటి అగ్రహారం రోడ్ విస్తరణలో కోర్ట్ కేసులు దాఖలు చేసిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటి అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. విస్తరణ పనుల పై కొందరు కోర్ట్ కి వెళ్లారని, సోమవారం నుండి 3 రోజుల్లో ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ మాస్టర్ ప్లాన్ ని సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సర్వే సమయంలో కోర్ట్ కి వెళ్లిన వారికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న టిడిఆర్ బాండ్లు, స్ట్రక్చరల్ నష్ట పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రోడ్, డ్రైన్, సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులను వేగంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, ఈఈ కోటేశ్వరరావు, ఏసిపి వెంకటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, టిపిఎస్ లు, టిపిబిఓలు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …