గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల ఆక్రమణల తొలగింపుపై రాజీ లేదని, పట్టణ ప్రణాళిక అధికారులు ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొరెటెపాడు పార్క్ వెనుక డ్రైన్, రోడ్ ఆక్రమణలు సోమవారం నుండి తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు కొరెటెపాడు, విద్యా నగర్ మెయిన్ రోడ్లలో పర్యటించి, ఆక్రమణల తొలగింపుపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మాట్లాడుతూ కొరెటెపాడు పార్క్ వెనుక రోడ్ లో షుమారు 60 శాతం, డ్రైన్ ని పూర్తిగా ఆక్రమణ చేసి వ్యాపారాలు నిర్వహించడంపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరెటెపాడు మెయిన్ అవుట్ ఫాల్ డ్రైన్ కూడా ఆక్రమణకు గురి కావడం వలన పూడిక తీయడానికి వీలు లేక వర్షాలు వస్తే నీరు చుట్టుపక్కల నివాసాల్లోకి వస్తుందన్నారు. ఆదివారం సాయంత్రానికి డ్రైన్, రోడ్ మీద ఆక్రమణలను వారే స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే సోమవారం ఉదయం నుండి జిఎంసి దళం పూర్తిగా తొలగిస్తుందన్నారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాలోని డ్రైన్లలో పూడికను వెంటనే తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులు డ్రైన్ కి వెలుపలకు రాకూడదన్నారు. అనంతరం డాన్ బాస్కో ఎదురు డ్రైన్ పై స్లాబ్ ని పరిశీలించి, డ్రైన్ లో పూడిక తీయడానికి వీలుగా ప్రతి 5 అడుగులకు ఒక మ్యాన్ హోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పర్యటనలో కార్పొరేటర్లు వి.శ్రీరామ్ ప్రసాద్, కె.కోటేశ్వరరావు, ఏసిపి రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …