విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శనివారం సందర్శించారు . ఎంపి కేశినేని శివనాథ్ కు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ ఎగ్జిబిషన్ కు విచ్చేసిన సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ ఒక మొక్కను నాటారు.
అలాగే ఈ ప్రదర్శనల శాలలో వెస్ట్ మెటీరియల్ తో విద్యార్ధులు తయారు చేస్తున్న వస్తువులను ఎంపి కేశినేని శివనాథ్ ఆసక్తి గా తిలకించారు. నేచురల్ ఫార్మింగ్ పద్దతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన శాలలో అందుబాటులో వున్న దేశీయ, అంతర్జాతీయ పూలమొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు,, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు గురించి రోజ్ సొసై టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి ఎంపి కేశినేని శివనాథ్ కు వివరించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శన శాలలో ఏర్పాటు చేసిన బెస్ట్ ఫ్రమ్ వెస్ట్ అనే ప్రొగ్రామ్ విద్యార్ధుల్లో సృజనాత్మకత పెంపొందించటానికి ఎంతో దోహదపడుతుందన్నారు. సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కాలుష్య నియంత్రణ ఒక చెట్ల పెంపకంతోనే సాధ్యమన్నారు. విద్యార్ధులకి చిన్నతనం నుంచే నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రోజ్ సోసైటీ తన సహకారం ఎప్పుడు వుంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, రోజ్ సోసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.లక్ష్మీ, ఇన్చార్జ్ పద్మప్రియ, మీడియా కో-ఆర్డినేటర్ అబ్బూరి రత్న లక్ష్మీ, రోజ్ కమిటీ సభ్యులు అట్లూరి సుమ, లక్ష్మీ తులసీ, సీతామహాలక్ష్మీ, ఉమా, ఛాయ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.