-లబ్బిపేట లో మస్జీద్ శంకుస్థాపన
-ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గద్దె హాజరు
-ముస్లిం యువతకు స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమం
-ప్రయోగాత్మకంగా 54వ, 55వ డివిజన్స్ లో ప్రారంభం
-డిసెంబర్ లో అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అభివృద్దిలో ముస్లిం సామాజిక వర్గం ముఖ్య భూమిక పోషించింది. విజయవాడ అభివృద్దికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏ విధంగా దోహదపడిందో..ఆ రంగంలో ఎక్కువగా వున్న ముస్లిం సామాజిక వర్గం కూడా విజయవాడ అభివృద్దికి దోహదం చేసిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. జమాఅతే అహ్లె హదీస్ ఆధ్వర్యం లో లబ్బిపేట లో నిర్మాణం జరగబోయే మస్జీద్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. జమాఅతే అహ్లె హదీస్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ఫజులూర్ రహమాన్ అధ్యక్షతన మస్జీద్ నిర్మాణానికి ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీరివురు శిలపలకం ఆవిష్కరించారు. వీరిని నిర్వహకులు శాలువాతో సత్కరించి ఖురాన్ గ్రంథం బహుకరించారు
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గానికి నీతి నిజాయితీకి మాత్రమే కాదు…ఇచ్చిన మాటకి కట్టుబడే స్వభావం సొంతమన్నారు. జమైతే ఆధ్వర్యంలో మసీద్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా వుందని తెలిపారు. మస్జీద్ లో ప్రార్థనలు మాత్రమే కాదు…సమాజంతో ఏవిధంగా వుండాలి. ఎదుట వారు చిరాకు పెట్టినా వారిని ప్రేమతో సహనంతో మార్చుకునే విషయాలు బోధిస్తారని పేర్కొన్నారు.
ముస్లిం సోదరుల ఓట్లు, ఆశీర్వచనాల వల్లే తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా గద్దె గెలవటం జరిగిందన్నారు.
ముస్లిం సోదరులకి ఏ సమస్య వున్నా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు కలిసి అండగా వుంటానన్నారు..
ఇక ముస్లిం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికసిద్దం చేసినట్లు ప్రకటించారు. ముందుగా ప్రయోగాత్మకంగా పశ్చిమ నియోజకవర్గం 54వ, 55వ డివిజన్స్ లో ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ద్వారా వచ్చే సబ్సిడీలు, క్లస్టర్స్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సు డిసెంబర్ 20వ తేదీన వుంటుందన్నారు. విజయవాడ నగరాభివృద్దికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేందుకు గద్దె తో పాటు కలిసి కృషి చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మస్జిద్ లో కేవలం నమాజ్ చదవటమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. సమాజంలో మంచిని పెంచే ప్రదేశం మసీద్ …అలాంటి మసీద్ శంకుస్థాపన తమ చేతుల మీదగా జరగటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను ఎంపిగా వున్న సమయంలో కూడా మైనార్టీ సంక్షేమం, అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మైనార్టీల అడిగే నిధులకు ఎప్పుడు వెనకడుగు వేయవద్దని ముఖ్యమంత్రి చంద్ర బాబు బోధించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఫిరోజ్, మౌలానా అబూ హురైరా మదని, జమాత్ రాష్ట్ర కోశాధికారి ఫరూఖ్ ఖాన్ , జమాతే అలే హదీస్ నగర కార్యదర్శి అతీ కుర్రహ్మాన్ , హబీబుర్రహ్మాన్, యూసఫ్ ఖాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.