విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యం బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ముగ్గురు లబ్దిదారులకి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ నైజాం గేట్ ప్రాంతంలో నివాసం వుండే షేక్ నాగుర్ ఇటీవల గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ చేయించుకుని ఎంపి కేశినేని శివనాథ్ సాయం తో సి.ఎమ్.ఆర్.ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈమేరకు మంజూరైన రూ.37,292 చెక్కును షేక్ నాగుర్ కి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
అలాగే సెంట్రల్ నియోజవర్గం 26వ డివిజన్ చుట్టుగుంట ప్రాంతంలో వుండే కోడి వెంకటేశ్వరరావు పేగుపూతతో బాధపడుతూ వైద్యం చేయించుకుని ఎంపి కేశినేని శివనాథ్ సాయం తో సి.ఎమ్.ఆర్.ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు మంజూరైన రూ.30,000 చెక్కును బాధితుడి తండ్రి కోడి నరసింహారావు కి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
ఇటీవల గర్భసంబంధిత ఆపరేషన్ చేయించుకున్న కాకర్ల సునీతకు మంజూరైన రూ.40,644 చెక్కును ఆమె కుటుంబ సభ్యులకి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులందుకున్న లబ్ధిదారులు ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.