గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఉర్దూ స్కూల్ లోని 124, 125, 126, 132 నుండి 136 వరకు, 139 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పిఎస్ నెంబర్ మరియు బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో అందిన ఫారాలు పక్కాగా ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. క్యాంప్ ల్లో ప్రజల నుండి నూతన ఓటు కై దరఖాస్తు అర్జీలు తీసుకోవడం జరిగిందన్నారు. ఓటర్ కార్డ్ లో చిరునామా, పేరు, పుట్టిన తేది తదితర మార్పుల కై అర్జీలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ డి.శ్రీనివాసరావు, సూపర్వైజరి అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …