Breaking News

విజయవాడలో ఘనంగా ”వేవ్స్ 2025”

-‘విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్’ ప్రాంగణంలో ‘యువ ఉత్సవ్ 2024’ నిర్వహణ
-‘వేవ్స్ 2025’ విద్యార్థులకు గొప్ప అవకాశం: రాజిందర్ చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త
“వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025″లో భాగంగా జరుగుతున్న పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘జిల్లా స్థాయి యువ ఉత్సవ్ 2024’ సందర్భంగా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ‘వేవ్‌ సమ్మిట్ ఇండియా’ అవకాశాలు, సవాళ్లను ఆ ప్రజెంటేషన్‌లో ఆయన స్ఫూర్తిదాయకంగా వివరించారు.

విద్యార్థులు మొబైల్‌ ఫోన్‌కు బానిసలుగా కాకుండా, కంటెండ్‌ సృష్టికర్తలుగా మారాలని రాజిందర్ చౌదరి సూచించారు. వినోద రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని వెలికితీసేలా & వేవ్‌ సమ్మిట్ ఇండియా పోటీల్లో చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించారు. విజయాలు సాధించడానికి సవాళ్లను స్వీకరించడం ఎంత కీలకమో చెప్పారు. యువ ఉత్సవ్‌లో వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను శ్రీ చౌదరి అభినందించారు.

‘విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్’ ప్రాంగణంలో, “ది పంచ్ ప్రాణ్ ఆఫ్ అమృత్ కాల్ గోల్ ఆఫ్‌ డెవలప్డ్ ఇండియా@2047 ” అనే అంశంపై యువ ఉత్సవ్‌ను ‘నెహ్రూ యువ కేంద్ర’ నిర్వహించింది. విజ్ఞాన మేళాతో పాటు రచయితలు, కళాకారులు, ఛాయాచిత్రగ్రాహకులకు పోటీలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద బృందాల సాంస్కృతికోత్సవం ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్ రమేష్ కొల్లేటి, జిల్లా ఎన్‌కేవై అధికారి సుంకర రాము, గుంటూరు సీబీసీ ఫీల్డ్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర కూడా యువ ఉత్సవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులతో మాట్లాడిన శ్రీ శుభం నోఖ్వాల్, విద్యార్థుల భవిష్యత్‌ కోసం, ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి విలువైన సూచనలు చేశారు.

యువ ఉత్సవ్ 2024 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని 14 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందుకున్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌కు చెందిన గుంటూరు ఫీల్డ్ యూనిట్, మెప్మా, డాక్టర్ సి శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, స్వయం సహాయక సంఘాలు యువ ఉత్సవ్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *