-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా, ఫిర్యాదు చేసిన వారి వద్దకు వెళ్లి పరిశీలించి సమస్యకు పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారము ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను చిట్టినగర్ లో ఉన్న సర్కిల్ 1,జోనల్ ఆఫీస్ నందు నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ అక్కడున్న అధికారులతో సర్కిల్ 1 పరిధిలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్కిల్ 2, 3 మరియు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఫిర్యాదుల స్వీకరణను పరిశీలించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సర్కిల్ 1 కార్యాలయంలో 2 ఫిర్యాదులు అందగా, కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 11 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఇంటి పనులు డోర్ నెంబర్ కరెక్షన్స్, అనధికార కట్టడాలు, ఆక్రమణలు, త్రాగునీటి సమస్యలు పై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ సోమవారం సర్కిల్ 1 కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ తో పాటు జోనల్ కమిషనర్ 1 రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఇంచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ హెలెన్, సానిటరీ సూపర్వైజర్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు, పాల్గొన్నారు.