Breaking News

రైళ్లలో జ‌న‌ర‌ల్ కోచ్‌ల పెంపు !

రైల్వే బడ్జెట్ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎసస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో రెండు జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌ను పెంచాలని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి రైల్వేబ‌డ్జెట్ చ‌ర్చ‌లో భాగంగా పార్ల‌మెంట్‌లో గురుమూర్తి డిమాండ్ చేశారు. అలాగే రైల్వేశాఖ‌కు గురుమూర్తి విన‌తిప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఈ నేప‌థ్యంలో గురుమూర్తి కృషి, అలాగే కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా ఆలోచించింది. ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టికే ఉన్న రెండు జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌కు మ‌రో రెండు కోచ్‌ల‌ను విడతాల వారీగా జ‌త చేయ‌డానికి రైల్వేశాఖ ముందుకు రావడంతో రైల్వేశాఖ‌కు గురుమూర్తి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇదే సంద‌ర్భంలో కోవిడ్ స‌మ‌యంలో కొన్ని స్టేష‌న్ల‌లో నిలిపివేసిన రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఎంపీ కోరారు. ఈ అంశంపై కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *