Breaking News

సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలు స్థాపించి, ఉపాధి పొందేలా చర్యలు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలు (food processing units) విరివిగా స్థాపించి, ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (prime minister formalisation of micro food processing enterprises scheme) అమలుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు.

ఈ పథకం కింద వ్యక్తిగత ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రూప్ పరిశ్రమలు ప్రారంభించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఎక్కువగా రైతు తయారీదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలలో ప్రతి సభ్యునికి ఈ పథకం పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకంలో 10% లబ్ధిదారు వాటా కాగా, 90 శాతం బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు అవకాశం ఉందని, యూనిట్ ఏర్పాటు చేసి మంచిగా రన్ చేసుకుంటూ 35% సబ్సిడీగా తిరిగి పొందవచ్చని, ఈ పథకం జిల్లాలో ఎక్కువమంది వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు ఈ స్కీం గురించి ప్రతి సభ్యురాలికి తెలియజేయాలన్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఏపీఎంలకు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ పథకం గురించి వివరించాలని, అదేవిధంగా మైక్రో క్రెడిట్ ప్లాన్ గురించి కూడా వివరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2020 నుండి ప్రారంభమైన ఈ పథకం 2025 వరకు అమలులో ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సూక్ష్మ సేద్య పథకం ఈవో, కమిటీ కన్వీనర్ విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె జ్యోతి, ఎల్డీఎం జయవర్ధన్, వ్యవసాయ శాఖ డిడి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *