రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్త ఆధ్వర్యంలో “మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన” పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ అనేక మంది అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీకి గురవుతున్నారని అన్నారు. ఈ బాధితులను కాపాడేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవలసిన చర్యలు ఏమిటి, అటువంటి బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు. నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడీ బాధితుల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలిపారు. జిల్లాలో మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీ వ్యవస్థ బాధితులను కాపాడేందుకు పనిచేస్తున్న వారికి ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు మరియు నల్సా 15100 టోల్ ఫ్రీ నెంబర్ గురించి వివరించారు ఐ.జె.ఎం. ప్రోగ్రాం పార్ట్నర్ శ్రీ. ఎం. జేసుదాస్ గారు మాట్లాడుతూ ప్రజలు వెట్టిచాకిరీ వ్యవస్థకి, అక్రమ రవాణాకి ఏ విధంగా బాధితులు అవుతున్నారని, ప్రమాదకర పరిస్థితులలో, హానికారక ప్రదేశాలలో వీరితో బలవంతంగా పని చేయిస్తుంటారని వివరించారు. వీరిని కాపాడేందుకు పని చేసే బృందాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐ.జె.ఎం. సభ్యులు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, వివిధ ఎన్.జి.ఓ. సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …