-విద్యా శాఖ అధికారులతో సమీక్షించిన కలెక్టర్
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బోతున్న మెగా పేరెంట్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యాశాఖా ధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విషయమై అంశాలను వివరించాలన్నారు . తల్లిదండ్రులకు వార్డు పెద్దలకు ఆహ్వాన పత్రాలను ముందుగానే పంపించాలన్నారు. పూర్తి పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలలలోనూ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1,2 పరీక్షల మార్కులు ఆన్లైన్లో నూరు శాతం నమోదు కావాలన్నారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వవలసి ఉన్నందున వెంటనే నూరు శాతం మార్కుల నమోదు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవాస ప్రాంతంలో డ్రాప్ ఔట్ విద్యార్థి ఉండకుండా చూడాలన్నారు. నూరు శాతం నమోదు లక్ష్యంగా ఉండాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పేరెంట్స్ డే కార్యక్రమానికి నిర్వహించు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ సమావేశం లో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు, ఏడి వెంకట్రాజు, 19 మండలాల నుండి ఎంఈఓ- 1 ఎంఈఓ -2 లు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది, ఐటీ విభాగసిబ్బంది, సమగ్ర శిక్షా సెక్టోరియల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.