గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ గుంటూరు సాధనలో నగర యువత పాత్ర కీలకమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. స్వచ్చత హి సేవాలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన సైక్లింగ్, 2కెవాక్, స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను సోమవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో స్వచ్చత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమాల్లో విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమయ్యారన్నారు. సైకిల్ ర్యాలీలు, 2కె వాక్ ల్లో పాల్గొన్న వారిని క్రమ పద్దతిలో నడిచేలా కృషి చేసిన ఎన్ఎస్ఎస్ విధ్యార్ధులను నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి సుధీర్, ఐటిసి బంగారు భవిష్యత్, ఫినిష్ సొసైటీ ప్రోగ్రాం మేనేజర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …