విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బొండా ఉమ అభినందన సభ-సన్మానం గాంధీనగర్ లో సోమవారం విజయవాడ గాంధీనగర్ “G-3” సినిమా ధియేటర్ (రాజ్ యువరాజ్ ) వద్ద గల మా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మరియు NDA కూటమి నేతల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమించిన సందర్భంగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా శ్రమిస్తున్న ప్రజా నాయకులు బొండా ఉమామహేశ్వరరావు కి వివిధ పార్టీల నాయకులతో, నగర పౌరులతో, ప్రముఖులతో ఉమన్న శ్రేయోభిలాషులతో, మిత్రులతో, పార్టీ నాయకులు కార్యకర్తలతో, మరియు వివిధ వర్గాల తో ఘనమైన అభినందన సభను ఏర్పాటు చేసి దానిలో ప్రముఖుల చేత ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని మా ఆర్ట్స్ బ్రదర్స్ అయిన బాబీ, చంటిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడక అనంతరం సన్మాన గ్రహీత అయిన బోండా ఉమామహేశ్వరావు గారు మాట్లాడుతూ తాను రాజకీయాలలో వంగవీటి మోహనరంగా రావుని చూసి రాజకీయాలలోకి రావడం జరిగినదని,.. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరి రంగా చూపిన మార్గంలో ఆయన స్ఫూర్తితో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి గత ప్రభుత్వం చేసిన అరాచకంతో మోసం చేసి 25 ఓట్లతో నేటి గెలిచిన నేను గెలిచినట్టు చూపించలేవు జరిగినదని కాను వివరాలను తెలియజేశారు.
ఆనాడు రంగా నిభాసితులందరికీ ఇళ్ల పట్నాలు ఇవ్వాలని పోరాటం చేస్తే నేడు తాను పూర్తిగా తీసుకొని అధికారంలోకి రాగానే పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు.
విజయవాడ గాంధీనగర్లో వంగవీటి మోహన రంగారావు నడిచిన నేల అని, ఆ నేల మీదే నేడు నాకు సన్మానం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని భవిష్యత్తులో కూడా తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం ముక్కు సూటిగా నిజాయితీగా ముందుకు సాగుతానని, భయం అంటే తెలియని వంగవీటి మోహన రంగా వారసులుగా ఉంటానని తెలియజేస్తూ ఆనాటి విషయాలు నేడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ విప్ బాధ్యతలు నెరవేరుస్తానని ప్రజా ఆమోదంగా ప్రజా రంజికంగా నిర్వర్తిస్తానని ప్రజల సమక్షంలో తెలియజేయగా, బహిరంగ సభకు హాజరైన యావత్తు ప్రజానీకం చప్పట్లతో నినాదాలతో పోరెత్తించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను, చెన్నుపాటి శ్రీను, చింతల బాబి, చింతల చంటి, నవనీతం సాంబశివరావు, నెల్లిబండ్ల బాలస్వామి, అల్లుడు సాంబశివరావు, చందు జనార్ధన్, ఉమ్మడి చంటి, మోదుగల తిరుపతమ్మ, బుల్ల విజయ్ కుమార్, బౌజూర్, లతోపాటు కార్పోరేటర్లు నగర ప్రముఖులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులురాధా రంగా మిత్రమండలి నేతలు వేదిక మీద ఆసీనులు అవ్వగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ వంగవీటి మోహనరంగా ని స్మరించుకుంటూ బోండా ఉమామహేశ్వరావుని అభినందించడం జరిగింది.