-అదానీ కేసులో జగన్ తప్పించుకోలేడు
-మీడియా సమావేశంలో గోనే అదానీ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్‌లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ లంచం ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవం కాకపోతే వైసిపి ఎమ్మెల్యే జగన్ అమెరికా వెళ్లి అక్కడ కోర్ట్ లో నిజం నిరూపించుకోని రావాలని మాజీ ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అమెరికా న్యూయార్క్‌లో నమోదైన అవినీతి కేసులో మాజీ సీఎం జగన్ , బిజినెస్ మెన్ గౌతమ్ అదానీ తప్పించుకోలేరంటూ మాజీ ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అదానీ ఇష్యూలో వైఎస్ జగన్ ఇరుక్కున్నారని, ఇక తప్పించుకోవటం అసాధ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ప్రధాన పత్రికలైన వాషింగ్టన్ పోస్ట్ , న్యూయర్క్ టైమ్స్ ప్రచురితమయ్యే పరిశోధనాత్మక కథనాలకు చాలా విశ్వసనీయత వుంటుందన్నారు. తప్పులు చేసి అలాంటి పత్రికల్లో ప్రచురితమైన నాయకులకి మనుగడ వుండదని…వారి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వుంటుందని తెలిపారు.
సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో జగన్ పేరు బాగా వినిపిస్తుందని, మీడియాలో రూ.1750 కోట్ల లంచం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయన్నారు. భారత్‌లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో అప్పటి ముఖ్యమంత్రులకి లంచం ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో అధానీ, జగన్ పై మోపబడిన అభియోగం నుంచి వారు బయట పడటం కష్టం అని స్పష్టం చేశారు. ముడుపుల కేసులో జగన్, అదానీ కంట్రీ టూ కంట్రీ ఎమ్.వో.యు కింద వారు అమెరికా వెళ్లాల్సి వుంటుందని, తప్పు చేసినట్లు రుజువు అయితే ఇద్దరు అరెస్ట్ అవుతారని వివరించారు.
అలాగే ఈ నెల 30 వ తేదీన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను కలిసి ఈ ఇష్యూ పై లెటర్ అందించి దేశ క్షేమం దృష్ట్యా, దేశ ప్రతిష్ట దిగజారకుండా వుండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరు రక్షించలేరంటూ ఈ విషయంపై ఎవరు డిబెట్ కి వచ్చినా సిద్దమే అంటూ వైసిపి నాయకలకి చాలెంజ్ విసిరారు. రాజ్య సభ ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి పి.వి.మిధున్ రెడ్డి ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంసంస్థ ద్వారా ఒప్పందం చేసుకున్నాము తమ కు ఎలాంటి లావాదేవీలతో సంబంధం లేదనడం విడ్డూరంగా వుందన్నారు.
చేశారు. అమెరికాలోని చట్టాలు చాలా కఠినంగా వుంటాయి…తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. అదానీతో పాటు తప్పు చేసిన జగన్ అమెరికా చట్టం నుంచి నాట్ స్కిప్ అన్నారు.