అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 26వతేది మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆప్ ఇండియాను అడాప్ట్ చేసుకోగా 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈనెల 26వతేదికి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి(రాజకీయ)ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అందరు జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని సూచించారు.
అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో మంగళవారం ఉ.11.30 గం.లకు జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు,అధికారులు తదితరులు పాల్గోనున్నారు.
అలాగే జిల్లాల్లో జిల్లా కలక్టర్ల నేతృత్వంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జిల్లా మంత్రులు,ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు సమక్షంలో ఘనంగా నిర్వహించాలని సురేశ్ కుమార్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు,శాఖాధిపతులు,కలక్టర్లను ఆయన కోరారు.
Tags amaravathi
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …