మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.26.11.2024 మంగళవారం నాడు మచిలీపట్నం లోని పోతేపల్లి లో గల “మచిలీపట్టణం ఇమిటేషన్ జ్యువలరీ పార్క్ మెంబెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి నరేష్ కుమార్ సంయుక్తంగా తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో, విజేతా గోల్డ్ కవరింగ్స్ వర్క్స్, రవి ఇంజెక్షన్ మౌల్డింగ్ వర్క్స్ మరియు మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 27 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 09 ఎంపిక కాగా, మరొక ఆరుగురు తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో, HR ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నియామకాధికారి తుర్లపాటి మధు, యంగ్ ప్రొఫెషనల్ ఎస్ జయ రాజు, APSSDC సంస్థ సిబ్బంది రాహుల్, Ch రాజేష్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ కె దిలీప్ మరియు SEEDAP సంస్థ సిబ్బంది రజిత పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …