విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి బాల ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ బంకును మంగళవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ, నాణ్యమైన పెట్రోలును భారత్ పెట్రోలియం బంకు ద్వారా వాహనదారులకు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు. వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేఫధ్యంలో వారి అవసరాలకు తగినట్లుగా మొగల్రాజపురం ప్రాంతంలో గిరి బాల షిల్లింగ్ స్టేషన్ పెట్రోలు బంకును అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పెట్రోలు బంక్ అధినేత గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్‌ను భారత్ పెట్రోలియం బంకు ద్వారా అందించి వాహనదారుల మన్ననలు పొందుతామని తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గద్దె గిరి బాల, గద్దె శేషుబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరంలోని పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …