Breaking News

నూతనంగా గిరి బాల ఫిల్లింగ్ స్టేష‌న్ భారత్ పెట్రోల్ బంకు ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని మొగల్రాజపురం జ‌మ్మిచెట్టు సెంట‌ర్ స‌మీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి బాల ఫిల్లింగ్ స్టేష‌న్ భారత్ పెట్రోల్ బంకును మంగ‌ళ‌వారం ఉద‌యం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే గ‌ద్దె మీడియాతో మాట్లాడుతూ, నాణ్యమైన పెట్రోలును భారత్ పెట్రోలియం బంకు ద్వారా వాహనదారులకు స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్వాహ‌కుల‌కు సూచించారు. వాహ‌నాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేఫ‌ధ్యంలో వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మొగ‌ల్రాజ‌పురం ప్రాంతంలో గిరి బాల షిల్లింగ్ స్టేష‌న్ పెట్రోలు బంకును అందుబాటులోకి తీసుకురావడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా పెట్రోలు బంక్ అధినేత గ‌ద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్‌ను భారత్ పెట్రోలియం బంకు ద్వారా అందించి వాహ‌న‌దారుల మ‌న్న‌న‌లు పొందుతామ‌ని తెలిపారు. న‌గ‌ర‌వాసులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో గ‌ద్దె గిరి బాల‌, గ‌ద్దె శేషుబాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *