-విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని, అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక అతిధిగా ఏర్పాటయిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తన చాంబర్ లో జరిగిన రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో భాగంగా సాంఘీక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులుతో కలిసి డా.బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నివాళులు అర్పించారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగ స్పూర్తిని అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా అమలు కావడం వల్ల రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు.