అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో గౌరవనీయులైన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లు కోరారు.
* ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో మార్పుల కోసం విన్నవించారు.
* ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 31 డిసెంబర్, 2024 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదు.
* రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని కోరుచున్నాము.
* డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వగలరు
* నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న 70% (AIIB) :30 %+ పన్నులు (AP ప్రభుత్వం) విధానం నుంచి 90% (AIIB) :10% (AP ప్రభుత్వం) మార్పు చేసి.. 455 మిలియన్ US డాలర్ల (అంటే రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదలను మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.