విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని, డిసెంబర్ 7, 2024న పాటించనున్న ఫ్లాగ్ డే నిధి సేకరణ కార్యక్రమం కోసం, ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, విజయవాడ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని, ఈ ఆదేశాల ప్రకారం, అన్ని శాఖల అధిపతులు మరియు జిల్లా కలెక్టర్లు తమ శాఖలకు చెందిన వాహనాలు లేదా కిరాయి వాహనాలను విజయవాడలోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఉంచాలని ఆ ప్రకటనలో వారు కోరినట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తెలియజేశారు..
విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ 2024 సంవత్సరానికి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని డిసెంబర్ 7, 2024 న నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన టోకెన్/ స్టిక్కర్లు/కార్ ఫ్లాగ్ లు అందించేందుకు వీలైనన్ని ఎక్కువ వాహనాలను ఉంచడానికి సంబంధిత అధికారులందరికీ తగిన సూచనలను జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ సంబంధిత జిల్లాల జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు 7 డిసెంబర్ 2024 న జెండా దినోత్సవం రోజున ఫ్లాగ్ డే కలెక్షన్ల పెంపు కొరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ ప్రకటనలో కుమార విశ్వజిత్ తెలియజేశారు.