విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీ శనివారం నాడే పెన్షన్ ని పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల పెన్షన్లన్నీ సకాలంలో అందేటట్టు చూసుకుంటామని, సర్కిల్ వన్ పరిధిలో 20744, సర్కిల్ 2 పరిధిలో 25906, సర్కిల్ 3 పరిధిలో 20721 పెన్షన్ దారులు ఉన్నారని, మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 67371 పెన్షన్ దారులు ఉన్నారని, నవంబర్ 30 వ తేదీన పెన్షన్ పంపిణి చెయ్యడం మొదలు పెడ్తామని అన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …