పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19 (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ పై చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో, పోలీసు అధికారులతో పర్యటన, భద్రత చర్య లపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనలు చేశారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ,జిల్లా ఎస్పీలతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక 2 వేల కిట్స్ ఏర్పాటు చేసి, శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో శానిటైజెషన్ చెయ్యాలని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ నుంచి ఉ.10.10 కి బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో ని హెలిప్యాడ్ కు ఉ.11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి అధికారులు, కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తదుపరి అక్కడ నుంచి ఉ.11.50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరంకు మ.12.00 కి చేరుకుని మ.1.00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పోలవరం లోని సమావేశ మందిరం నుంచి మ.1.10 బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని మ.1.20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకుంటారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అంతకుముందు పోలీసు అధికారులకు చేపట్టే భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏ ఎస్ ఎల్ లో కలెక్టర్ , ఎస్పీ తో పాటు పోలవరం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ ఇంఛార్జి పిఓ ఐటీడీఏ ఓ.ఆనంద్, ఇరిగేషన్ ఎస్సి కె. నరసింహ మూర్తి, పోలవరం ప్రాజెక్ట్ సి.ఈ. సుధాకర్ బాబు , ఎస్ఇ నరసింహ మూర్తి ,జంగారెడ్డి గూడెం ఆర్దీవో వైవి.ప్రసన్న లక్ష్మి , డిఎస్పీ కె.లతా కుమారి, కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి, మేఘా ఇంజనీరింగ్ జీఎం ముద్దు కృష్ణ ,మేనేజర్ మురళి , ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags polavaram
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …