Breaking News

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు.

కమిటీ చైర్మన్: జ్యోతుల నెహ్రూ, కమిటీ సభ్యులు: బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కే.కె. రంగా రావు, దాట్ల సుబ్బరాజు లను నియమించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి, రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇది ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *