Breaking News

రాజధానిలో భారీ స్థాయిలో ESI హాస్పిటల్, మెడికల్ కాలేజీ

-గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని సంస్థలు
-డిసెంబర్ చివరికి సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి
-జనవరి మొదటి వారం నుంచి రాజధాని నిర్మాణ పనులు
-మీడియా సమావేశంలో మంత్రి నారాయణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు మంత్రి నారాయణ….2019 కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా…వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయన్నారు…భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు మంత్రి తెలిపారు..రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది.మంత్రులు నారాయణ,కొల్లు రవీంద్ర తో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు…మంత్రులు పయ్యావుల కేశవ్,టీజీ భరత్, దుర్గేష్,సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు…2019 కి ముందే టీడీపీ ప్రభుత్వంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు…అయితే ఆయా సంస్థలకు కేటాయించిన భూములను సంబంధించి కాల పరిమితి ముగియడంతో తిరిగి వారి నుంచి రాత పూర్వకంగా అంగీకారం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు…అయితే తాజాగా అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రి,మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు…అలాగే గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు..ఆయా సంస్థల వివరాలు..

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు(CITD)5 ఎకరాలు కేటాయింపు..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU)కి 0.8 ఎకరాలు కేటాయింపు..
బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు 15 ఎకరాలు కేటాయింపు…
లార్సన్ అండ్ టర్బో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి 5 ఎకరాలు కేటాయింపు…
బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ కి 10 ఎకరాలు కేటాయింపు…
టీటీడీ కి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు పూర్తి అంగీకారం..

అయితే గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు మంత్రి ..దీంతో పాటు ఆయా సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంత భూమి కేటాయించారు..ప్రస్తుతం ఎంత అవసరం అనేదానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.కొత్తగా భూ కేటాయింపులు చేసే సంస్థలకు ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామన్నారు.అన్నీ సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు మంత్రి

జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు
వచ్చే జనవరి నుంచీ రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు మంత్రి నారాయణ..డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలు కు టెండర్లు పూర్తవుతాయన్నారు…గతంలో పనులు నిలిచిపోయిన వాటికి సంబంధించి టెండర్ ల ఒప్పందాలు రెండు మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు..ఆ వెంటనే కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు.

జగన్ చేసిన కన్ఫ్యూజన్ తో రాష్ట్రానికి తీరని నష్టం:కొల్లు రవీంద్ర
మాజీ సీఎం జగన్ రాజధానిపై చేసిన గందరగోళం తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగింది..కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తోంది…కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చెప్పడానికి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఉదాహరణ అన్నారు మంత్రి.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *